కరేబియన్లపై టీమిండియా ఘన విజయం
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. టీమిండియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కరేబియన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా...