పట్టాలపై నెత్తురోడిన మూగజీవాలు

• రైలు ఢీకొని 100కు పైగా గొర్రెల మృతి • ఘట్‌కేసర్‌ సమీపంలో తెల్లవారుజామున ఘటన • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కాపరులు   ఘట్‌కేసర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొనడంతో 100కు పైగా గొర్రెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన ఔషాపూర్‌ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన కాపరులు తమ గొర్రెల మందతో కేపాల్‌ వద్ద రైల్వే...