ప్రత్యక్ష దాడి జరిగితే అణ్వాయుధ ప్రయోగం తప్పదు: పుతిన్ హెచ్చరిక
మాస్కో: తమ భూభాగంపై లేదా కలినిన్ గ్రాడ్‌పై ప్రత్యక్ష దాడికి పాల్పడితే దానికి సమాధానంగా అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న అన్ని రకాల శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. మాస్కోలో నిర్వహించిన Valdai Discussion Club వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం రష్యాకు లేదని, తాము శాంతియుత సహజీవనాన్నే కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే తమ దేశంపై దాడి జరిగితే మాత్రం పరిస్థితులు...