మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణం !
- భారీ షెడ్ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం - ఫంక్షన్ హాల్ పన్ను వ్యవహారంపై కూడా అనుమానాలు పెద్ద అంబర్‌పేట్, జూన్ 23 (ప్రభాత సూర్యుడు): మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నాగోల్ సర్కిల్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కళ్ళెం బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో మున్సిపల్ అనుమతులు లేకుండానే భారీ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ నిర్మాణం నాగోల్ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులకు...