రాజధానిలో వేగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు.. నాంపల్లిలో రేపే శంకుస్థాపన
హైదరాబాద్‌లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. నగరంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఇందిరమ్మ టవర్స్' పనులు ఊపందుకుంటున్నాయి. తొలి దశలో 16 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. తాజాగా నాంపల్లి నియోజకవర్గంలో నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం మల్కం చెరువు వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే....