PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:33 pm Posted by : PRABHATHA SURYUDU

హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత పరిస్థితుల నడుమ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న కొద్ది గంటల్లో నగరంలోని దక్షిణ భాగంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

బాలాపూర్, మామిడిపల్లి, పహాడీ షరీఫ్, శంషాబాద్, శివరామ్ పల్లి, బద్వేల్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. వెస్ట్ హైదరాబాద్ (West Hyderabad) పరిధిలో శుక్రవారం సాయంత్రం 5:50 గంటలకు వర్షం తగ్గగా, తదుపరి గంటలో దక్షిణ హైదరాబాద్‌లో వర్షాలు పడొచ్చని వాతావరణ విశ్లేషకుడు Telangana Weatherman T Balaji తెలిపారు. అంతకుముందు శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, మణికొండ, షేక్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కోకాపేట్, మాధాపూర్, హైటెక్ సిటీల్లో వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షం తీవ్రమయ్యేలోపే ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.

 

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో Hyderabad Rains జోరందుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతున్నప్పటికీ, సాయంత్రం నుండి రాత్రి సమయంలో నల్గొండ, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని Telangana Weather Report పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.