జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పోటీల్లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. 15వ రోజు పోటీలు పూర్తయ్యేసరికి భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో మొత్తంగా 85 పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టిక (Asian Games 2026 Medal Tally) లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ స్థానం ఎంతవరకు నిలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఐదో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్తాన్ కూడా 21 స్వర్ణాలతో భారత్‌కు పోటీగా ఉంది. ఆఖరి రోజున జరిగే ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో ఉజ్బెకిస్తాన్ స్వర్ణం గెలిస్తే, భారత్‌ను ఐదో స్థానానికి నెట్టి టాప్-4లో నిలుస్తుంది.
.2022 చైనా ఏషియన్ గేమ్స్‌తో పోలిస్తే ఈసారి భారత ప్రదర్శన తగ్గడం గమనార్హం. గత ఎడిషన్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలతో రికార్డు స్థాయిలో 106 పతకాలు సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ ఈసారి 21 పతకాలు తక్కువగా వచ్చాయఅథ్లెట్ల ట్రైనింగ్, విదేశీ కోచ్‌లు, స్పోర్ట్స్ పరికరాలు, డైట్ సౌకర్యాల కోసం భారత ప్రభుత్వం ఈసారి దాదాపు రూ.800.70 కోట్లు వెచ్చించింది. అయితే, క్రీడల బడ్జెట్ (Asian Games Budget) భారీగా పెరిగినప్పటికీ, ఆ స్థాయిలో ఫలితాలు రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
మహిళలదే పైచేయి!
ఈసారి భారత్ సాధించిన పతకాల్లో మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 21 స్వర్ణాల్లో మహిళలు 11 సాధించగా, పురుషులు కేవలం 7 పసిడి పతకాలకే పరిమితమయ్యారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ల ద్వారా 3 స్వర్ణాలు లభించాయి.
* మహిళలు: 11 గోల్డ్, 11 సిల్వర్, 16 కాంస్యాలు (మొత్తం 38)
* పురుషులు: 7 గోల్డ్, 14 సిల్వర్, 17 కాంస్యాలు (మొత్తం 38)
* మిక్స్‌డ్ టీమ్స్: 3 గోల్డ్, 2 సిల్వర్, 4 కాంస్యాలు (మొత్తం 9)
ఆర్చరీ, షూటింగ్‌లలో మెరుపులు & చారిత్రక విజయాలు
ఆర్చరీ, షూటింగ్ విభాగాల్లో భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించారు. ఆర్చరీలో 5 గోల్డ్, 2 సిల్వర్, 2 కాంస్యాలతో 9 పతకాలు, షూటింగ్‌లో 3 గోల్డ్, 8 సిల్వర్, 4 కాంస్యాలతో 15 పతకాలు దక్కాయి. బాక్సింగ్‌లో 3 గోల్డ్, రెజ్లింగ్‌లో 2 గోల్డ్ పతకాలు సాధించారు. క్రికెట్ (పురుషులు & మహిళలు), హాకీ, కబడ్డీ జట్లు పసిడి పతకాలతో మెరిశాయి.
చైనా ఆధిపత్యం – భారత్ వెనుకంజ
జనాభాలో చైనాను దాటేసిన భారత్, పతకాల విషయంలో మాత్రం బాగా వెనకబడింది. చైనా 169 గోల్డ్, 89 సిల్వర్, 83 కాంస్యాలతో మొత్తంగా 341 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా సాధించిన పసిడి పతకాల సంఖ్యలో కనీసం సగం కూడా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య (85) లేకపోవడం గమనార్హం. మరోవైపు, ఆతిథ్య జపాన్ గతంలో సాధించిన 52 స్వర్ణాల నుండి ఈసారి ఏకంగా 83 గోల్డ్ మెడల్స్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది.