ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeఆధ్యాత్మికంPurnami Garuda Seva : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Purnami Garuda Seva : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

📰 Generate e-Paper Clip

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

గరుడ వాహనంపై మలయప్ప స్వామివారి దర్శనం

వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్

తిరుమల – ప్రభాత సూర్యుడు: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవను వైభవంగా నిర్వహించారు. ఈ వాహన సేవలో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ సేవలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ వాహన సేవలో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన గరుడ వాహన సేవలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడసేవ తిరుమలలో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములతో పాటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. వాహన సేవకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. పౌర్ణమి గరుడసేవలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పౌర్ణమి గరుడసేవలో శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వడంతో తిరుమల ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

For Related Link :https://ttdevasthanams.ap.gov.in/home/dashboard

For Our More News Click Here :https://prabhathasuryudu.com/ttd-warning-fake-vip-break-darshan-scp-developers/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!