ACB Ride : ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్, సర్వేయర్
ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్, సర్వేయర్ లేఅవుట్ సర్వే నివేదిక కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్ హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. లేఅవుట్కు సంబంధించి సర్వే నిర్వహించి, జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఏసీబీ వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా...