అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికలకు దూరమా?
అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికలకు దూరమా? వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు: ఎంఐఎం ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఆయన పేర్కొన్నారు. తన వయస్సును ప్రస్తావిస్తూ.. “నేను ముసలోడిని అయిపోయాను” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి....