PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 9:08 pm Posted by : PRABHATHA SURYUDU

AP Politics: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. ప్రభుత్వంలో చర్చలు జరిగినట్లు ప్రచారం

అమరావతి – ప్రభాత సూర్యుడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

టూరిజం ప్రచారం కోసం చిరంజీవి పేరు పరిశీలన

గతంలో గుజరాత్ టూరిజం ప్రచారానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అధికారిక ప్రకటనపై ఆసక్తి

ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీగా నాగబాబు ఉన్న నేపథ్యంలో, త్వరలోనే చిరంజీవి నియామకంపై కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. ప్రభుత్వ ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

For Related Link : https://x.com/KChiruTweets


For Our More News Click Here: https://prabhathasuryudu.com/ttd-warning-fake-vip-break-darshan-scp-developers/