PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 10:51 pm Posted by : PRABHATHA SURYUDU

ఏపీకి రేర్ ఎర్త్ పెట్టుబడుల వేట.. రష్యా గిరెడ్మెట్ ప్రతినిధులతో కీలక చర్చలు

ఏపీకి రేర్ ఎర్త్ పెట్టుబడుల వేట.. రష్యా గిరెడ్మెట్ ప్రతినిధులతో కీలక చర్చలు

అమరావతి, ప్రభాత సూర్యుడు:

రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో మాస్కోలో కీలక సమావేశం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సందర్భంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో లభ్యమవుతున్న భారీ ఖనిజ వనరులను ఆధారంగా చేసుకుని డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.

అలాగే భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), పవన విద్యుత్ రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ (NdFeB) తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించాలని గిరెడ్మెట్ ప్రతినిధులను కోరినట్లు తెలిపారు.

రేర్ ఎర్త్ ఖనిజాల ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలు లభించనున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.