Asian Games 2026 | ఆసియా క్రీడల్లో నెత్రా సత్తా.. భారత్‌కు మరో కాంస్యం
ఆసియా క్రీడల్లో (Asian Games 2026) భారత్ పతకాల వేట ఉత్సాహంగా సాగుతోంది. తాజాగా భారత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి నెత్రా కుమనన్ (Nethra Kumanan) అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో.. మహిళల డింగీ (ILCA 6) సెయిలింగ్ (Sailing) విభాగంలో బరిలోకి దిగిన ఆమె పతకంతో మెరిసింది. ప్రారంభంలో కాస్త వెనుకబడినప్పటికీ, ఫైనల్ రేసుల్లో నెత్రా అద్భుతంగా పుంజుకుని ఆధిక్యం ప్రదర్శించింది. తుది పోరులో నెత్రా కుమనన్, హాంకాంగ్‌కు చెందిన క్రీడాకారిణి స్టెఫానీ...