కేజీబీవీ బాలికల మధ్య డిప్యూటీ సీఎం భట్టి బర్త్‌డే వేడుకలు
మొయినాబాద్ – ప్రభాత సూర్యుడు
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విద్యార్థినులతో కూర్చొని భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచే అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు వెచ్చించేందుకు వెనుకాడదని స్పష్టం చేశారు. https://dcmpms.telangana.gov.in/

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద బాలికల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం భట్టి విక్రమార్క నిరాడంబరతకు నిదర్శనమని కొనియాడారు. గతంలో పెండింగ్‌లో ఉన్న డైట్, కాస్మోటిక్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు భీమ్ భరత్ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
https://prabhathasuryudu.com/illegal-constructions-rampant-in-nagole-circle/