Fighter Smith Machchanరియల్ | హీరో పైలట్ స్మిత్ మచ్చార్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’
గాంధీనగర్: విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను అరుదైన గౌరవం వరించింది. ఆయన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా గుజరాత్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక 'విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు' (Vishisht Gujarat Garima Award) ను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన (Flydubai flight incident) చోటుచేసుకుంది....