న్యూఢిల్లీ: విపత్కర పరిస్థితిలోనూ అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన Flydubai Captain Smith Macharతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. కెప్టెన్ స్మిత్ చూపిన సమయోచిత నిర్ణయం, సంయమనం యావత్ దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని మోదీ Video Call ద్వారా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
“మీ ధైర్యం, ధైర్యసాహసాల వల్ల అనేక ప్రాణాలు నిలిచాయి. యావత్ భారతదేశం మీ కోసమే ప్రార్థిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు. భారతీయులు ఎప్పుడూ ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే గొప్ప తత్వం ఉన్నవారని మోదీ అన్నారు. స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ‘మహా మృత్యుంజయ జపం’తో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని ప్రధాని వివరించారు.
గాయాల మధ్యే హనుమాన్ చాలీసా జపం…
ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సమయంలో కెప్టెన్ స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడినప్పటికీ, ఎలాగైనా లేచి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాక్‌పిట్ తలుపులు తెరిచినట్లు స్మిత్ గుర్తు చేసుకున్నారు. ఆ నరకయాతన అనుభవిస్తున్న సమయంలో తనకు దైవబలాన్ని ఇచ్చిన Hanuman Chalisa నిరంతరం జపిస్తూనే ఉన్నానని వెల్లడించారు. “మీరు నాకు అతిపెద్ద స్ఫూర్తి. దేశ ప్రధాని నుంచి ఇలాంటి ప్రోత్సాహకరమైన ఫోన్ కాల్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు దక్కిన లభించిన అతిపెద్ద గౌరవం” అని స్మిత్ ఆనందం వ్యక్తం చేశారు.
స్మిత్ ప్రదర్శించిన మానవత్వాన్ని, ధైర్యాన్ని కొనియాడిన ప్రధాని మోదీ.. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో భారత్‌కు తిరిగిరావాలని, దేశమంతా ఆయన స్వాగతం కోసం ఎదురుచూస్తోందని ఆకాంక్షించారు.