Hyderabad Tank Bund Ganesh Idol: సచివాలయాన్ని ఆశీర్వదిస్తున్న గణనాథుడు

సచివాలయంపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా... హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద కొలువుదీరిన గణనాథుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు తెలంగాణ సచివాలయాన్ని తాకుతూ ఆశీర్వదిస్తున్నట్లుగా, మరోవైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం చేయి అందుకున్నట్లుగా కనిపిస్తున్న వినాయకుడి విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ గణనాథుడి విగ్రహం పరిసరాల్లోని ప్రముఖ కట్టడాలు, విగ్రహాలతో కలిసిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సచివాలయం వైపు గణనాథుడి చేయి చాపి ఉన్న దృశ్యం, అంబేద్కర్‌ విగ్రహం చేయిని అందుకున్నట్లుగా...