పని చేస్తే చేయండి..లేకపోతే వెళ్లిపోండి

హైడ్రా సిబ్బందిపై రంగనాథ్ వ్యాఖ్యలు కలకలం జీతాల పెంపు కోరిన ఉద్యోగులకు ఘాటు సమాధానం? హైడ్రా కమిషనర్ తీరుపై సిబ్బందిలో అసంతృప్తి హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జలవిహార్‌లో జరిగిన సమావేశంలో జీతాల పెంపు అంశాన్ని ప్రస్తావించిన ఉద్యోగులకు ఆయన ఘాటుగా స్పందించినట్లు సమాచారం. సమావేశంలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.22 వేల వేతనం లభించేదని, ప్రస్తుతం కేవలం రూ.17 వేలు మాత్రమే...