ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ముసుగులో అక్రమ అబార్షన్లు
అక్రమ అబార్షన్ కేంద్రంపై పోలీసుల దాడి ఇద్దరు అరెస్ట్.. న్యాయమూర్తి ఎదుట హాజరు నాగోల్ – ప్రభాత సూర్యుడు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో అక్రమంగా గర్భస్రావాలు (అబార్షన్లు) నిర్వహిస్తున్న వ్యవహారం పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మహిళల ఆరోగ్యంతో పాటు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, జైపురి కాలనీ...