అక్రమ నిర్మాణాల జోరు.. అధికారుల పర్యవేక్షణ కరువు..!

పెద్ద అంబర్‌పేట్, కుంట్లూరు డివిజన్లలో అనుమతిలేని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం నాగోల్ సర్కిల్ – ప్రభాత సూర్యుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్‌ పరిధిలోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా భారీ షెడ్లు, గోదాములు, బహుళ అంతస్తుల భవనాలు, సెల్లార్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు...