Pedda Ambarpet : అక్రమ నిర్మాణాలపై మౌనం ఎందుకు ?
చర్యలు లేకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోరా? అంటూ స్థానికుల ప్రశ్నలు పెద్ద అంబర్‌పేట్ - ప్రభాత సూర్యుడు నాగోల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పెద్ద అంబర్‌పేట్ డివిజన్‌లో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, పెద్ద అంబర్పేట్ లోని నాగోల్ సర్కిల్ కార్యాలయానికి అతి చేరువలో కళ్లెం బాల్ రెడ్డి...