PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:35 am Posted by : PRABHATHA SURYUDU

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల పురోగతిపై కమిషనర్ సమీక్ష

రంగారెడ్డి, ప్రభాత సూర్యుడు

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి మరియు భూసేకరణ (R&R & LA) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.

https://rangareddy.telangana.gov.in/

శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.