కోహెడ అంతర్జాతీయ మార్కెట్ దేశానికే దిక్సూచి.. నిర్మాణ పనుల పరిశీలన
కోహెడ అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు కోహెడలో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ (IAS), మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులతో కలిసి మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి, పలు సూచనలు...