కొమరవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి
కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం సిద్దిపేటకు మరో అభివృద్ధి మైలురాయి స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రభాత సూర్యుడు – సిద్దిపేట సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లిలో నూతనంగా నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాకు రైల్వే సౌకర్యం కల్పించడం దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గం...