ఇందు అరణ్యాలో ‘మీ సురక్ష’ అవగాహన సదస్సు.. భద్రతపై ప్రజలకు కీలక సూచనలు

బండ్లగూడ ఇందు ఆరణ్య అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ అవగాహన హైదరాబాద్, ప్రభాత సూర్యుడు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న ఇందు ఆరణ్య అపార్ట్‌మెంట్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో "మీ సురక్ష" కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు పి. శివనాగ ప్రసాద్, పి. దశరథ్, పోలీసు సిబ్బంది మరియు బీట్ కానిస్టేబుల్-2 సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారి మగ్బుల్ జాని అపార్ట్‌మెంట్ నివాసితులను ఉద్దేశించి ప్రసంగించారు. "మీ సురక్ష" కార్యక్రమం ద్వారా పౌరుల భద్రతను మరింత...