PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 1:05 am Posted by : PRABHATHA SURYUDU

నాగోల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా జి రాజు

పెద్ద అంబర్‌పేట్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

పెద్ద అంబర్‌పేట్ – ప్రభాత సూర్యుడు

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా జి రాజు బాధ్యతలు స్వీకరించారు. సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఆయనను నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటి వరకు నాగోల్ సర్కిల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్. నిత్యానంద్ స్థానంలో జి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పెద్ద అంబర్‌పేట్ కార్యాలయంలో ఆయన శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

నాగోల్ సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తానని ఈ సందర్భంగా జీ రాజు పేర్కొన్నారు.