PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 6:30 am Posted by : PRABHATHA SURYUDU

PM Kisan: జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ

న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 23వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీని ప్రకటించింది. జూన్ 20న దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ చేయనుంది. https://pmkisan.gov.in/

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 23వ విడత నిధుల ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అయితే ఈ విడత నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ-కేవైసీ పూర్తికాకపోతే పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. https://prabhathasuryudu.com/ts-agriculture-revanth-reddy-news/

రైతుల ఆర్థిక భద్రత, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలలో పీఎం కిసాన్ ఒకటిగా నిలిచింది. ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ ఖర్చుల భారం కొంత మేర తగ్గడంతో పాటు ఆర్థికంగా చేయూత అందుతోంది.