జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలకు వేగం

స్టాప్ డయేరియా, పల్స్ పోలియో, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమీక్ష రంగారెడ్డి జిల్లా – ప్రభాత సూర్యుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (ఎన్‌డీడీ), హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ స్వర్ణకుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్...