80s Trend : Revanth Reddy 80s Trend.. ‘అప్పుడు ఇలా ఉండేవాడిని’
80s ట్రెండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. ‘అప్పుడు నేను ఇలా ఉండేవాడిని’ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు: సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల ట్రెండ్ వైరల్‌గా మారింది. 1980ల నాటి ఫ్యాషన్, హెయిర్‌స్టైల్, ఫొటోగ్రఫీ, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిస్తున్న రెట్రో ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సామాన్యుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు పలువురు ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ 80s Trendలో భాగమయ్యారు. ‘80ల్లో నేను ఇలా ఉండేవాడిని’...