ప్రజా పాలనలో పేదింటి ఆడపడుచులకు అండగా రేవంత్ సర్కార్

400 మంది లబ్ధిదారులకు రూ.4 కోట్లకు పైగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు ప్రజా పాలనలో పేద కుటుంబాల ఆడపడుచులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.4,00,46,400 విలువైన చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం...