నాకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలి’
కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ డిల్లీ/హైదరాబాద్, ప్రభాత సూర్యుడు తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనపై ఊహాగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. జూన్ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతున్న వేళ, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం...