శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం
శ్రీశైలం – ప్రభాత సూర్యుడు:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,44,998 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు నీటి విడుదల మాత్రం చేపట్టలేదు.
నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది
శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.90 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 129.4646 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు
ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించలేదు. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
For Related Link :
For Our More News Click Here: