Srisailam Dam: భారీగా వరద.. వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం – ప్రభాత సూర్యుడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,44,998 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు నీటి విడుదల మాత్రం చేపట్టలేదు. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.90 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 129.4646 టీఎంసీల...