పరస్పర అంగీకారంతో శారీరక బంధం తప్పుకాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకారంతో శారీరక బంధం తప్పుకాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, ప్రభాత సూర్యుడు: పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై నమోదైన అత్యాచార కేసును విచారించిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన ఓ జంట కేసులో ఈ తీర్పు వెలువడింది. 2014లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అనంతరం ప్రేమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో పలుమార్లు శారీరక సంబంధాలు...