RTI దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
వ్యక్తిగత లబ్ధికి వాడితే కఠిన చర్యలు
న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు
సమాచార హక్కు చట్టం (RTI)ను వ్యక్తిగత లబ్ధి, బ్లాక్‌మెయిలింగ్ కోసం వినియోగించే వారిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన RTI చట్టాన్ని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. https://rtionline.gov.in/

తాను RTI కార్యకర్తనని చెప్పుకుంటూ ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి కూడా నిరాకరించింది. RTI చట్టం ప్రజాస్వామ్యంలో పారదర్శకతను పెంపొందించే శక్తివంతమైన సాధనమని, అయితే దానిని వ్యక్తిగత లాభాల కోసం లేదా బ్లాక్‌మెయిలింగ్‌కు వాడుకోవడం చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి దుర్వినియోగాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
https://prabhathasuryudu.com/bhatti-vikramarka-celebrates-birthday-with-kgbv-girls-in-moinabad/