బడంగ్‌పేట్ సర్కిల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బడంగ్‌పేట్ – ప్రభాత సూర్యుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర...