హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరోసారి హైకోర్టు షాక్

రూ.50 వేల జరిమానా విధించిన హైకోర్టు.. చెల్లించిన తర్వాతే అఫిడవిట్ స్వీకరించాలని ఆదేశం హైదరాబాద్, ప్రభాత సూర్యుడు: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఆయనపై రూ.50 వేల జరిమానా విధించింది. హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం యూసుఫ్‌గూడ పరిధిలోని సర్వే నంబర్ 45 (హనుమాన్ టెంపుల్ వెనుక) ఉన్న భూమికి సంబంధించి కోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, హైడ్రా అధికారులు అక్కడ కాంపౌండ్...