Telangana News: ఆగస్టు 10న వరుణ యాగం.. సీఎం రేవంత్ నిర్ణయం

ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు ముహూర్తాన్ని నిర్ణయించారు. నాగార్జునసాగర్‌లో యాగం నిర్వహణ వరుణ యాగాన్ని నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు...