తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రభాత సూర్యుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా నిలబెట్టడమే తమ లక్ష్యమని, "తెలంగాణ రైజింగ్-2047" దార్శనికతతో రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రైతుల కోసం రూ.2...