తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 93 వేల మందికి పైగా శ్రీవారి దర్శనం

తిరుమల, ప్రభాత సూర్యుడు  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ 7, 2026న మొత్తం 93,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 41,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు నమోదైంది. భక్తులకు అందించిన సేవల్లో భాగంగా 4.22 లక్షల లడ్డూలు విక్రయించగా, 3.12 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే 4,005 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని వెయిటింగ్...