హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు
తెలంగాణలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుల సంక్షేమం, పంటల సాగుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యంత కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డి బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విత్తనాల సరఫరా మొదలుకొని పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నిర్దిష్ట కార్యాచరణను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

1. ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు:
ధాన్యం కొనుగోళ్లలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే సీజన్ నుంచి కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల శాఖ ఎండీ, ప్రణాళికా విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఏ రైతు ఏ పంట వేశాడు, ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చితంగా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చేయాలని చెప్పారు.
(ఇక్కడ క్లిక్ చేసి మా వెబ్‌సైట్ లోని తెలంగాణ రైతు భరోసా పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి – https://prabhathasuryudu.com/bhatti-vikramarka-celebrates-birthday-with-kgbv-girls-in-moinabad/
2. సన్న వడ్ల రైతులకు బోనస్ & సబ్సిడీ విత్తనాలు:
సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. మార్కెట్లో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. ఈ విత్తనాలను నేరుగా రైతు వేదికల్లోనే అందుబాటులో ఉంచాలని, పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని సూచించారు.
3. రైతు వేదికల ఆధునీకరణ:
రైతు వేదికలను ఇకపై కేవలం భవనాలుగా కాకుండా రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలి. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.
4. టెక్నాలజీ వినియోగం మరియు ఎరువుల పంపిణీ:
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ (AI) పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయనం చేసి వ్యవసాయంలో వినియోగించాలని తెలిపారు.
5. కేంద్రంపై ఒత్తిడి – రామగుండం ఎరువులు:
ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని స్పష్టం చేశారు.
(కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వెబ్‌సైట్ ను ఇక్కడ సందర్శించండి – https://agri.telangana.gov.in/
మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, గతంలో మొక్కజొన్న టన్నుకు రూ. 13 వేలు రాగా, ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చేలా చేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.