TS Agriculture: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్!
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు తెలంగాణలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుల సంక్షేమం, పంటల సాగుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యంత కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డి బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విత్తనాల సరఫరా మొదలుకొని పండించిన పంట ఉత్పత్తుల...