TS Vanamahotsavam: గుర్రంగూడలో వనమహోత్సవానికి సీఎం రేవంత్ శ్రీకారం
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ, ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, గతంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, వరదల అనుభవాల నుంచి తీసుకున్న సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. గత పాలనలో చెరువుల కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల కారణంగా హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే అతలాకుతలమయ్యేదని సీఎం గుర్తు చేశారు....