TTD Pushpayagam: 3 టన్నుల పుష్పాలతో గోవిందరాజస్వామి సేవ
మూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం తిరుపతి – ప్రభాత సూర్యుడు: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, వేలాది మంది భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పుష్పయాగ మహోత్సవం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలిసీ...