TTD Brahmotsavam: జూన్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

జూన్ 23న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి – ప్రభాత సూర్యుడు: తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రీకరణకు సంకేతంగా ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి, దైవ కైంకర్యాలకు...