జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
- టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు
సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.
ఉచిత వైద్య శిబిరం – జర్నలిస్టులకు ఆరోగ్య భరోసా
అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కామినేని ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి యూడబ్ల్యూజే అండగా ఉంటూ తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, జిల్లా కోశాధికారి సంరెడ్డి శశిపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జెనిగె పాండు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రవీణ్, సీనియర్ జర్నలిస్టులు జాల కిషన్, అనంతుల శ్రీనివాస్, సోలిపురం రజనీకాంత్ రెడ్డి, వర్దెల్లి దశరథ, రచ్చా శేఖర్, ఆంజనేయులు, అవంచ సురేందర్, వైద్యులు దివ్యారెడ్డి, శ్రేయాన్, మార్కెటింగ్ బృందం సందీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే అబ్దుల్లాపూర్‌మెట్ నూతన మండల కమిటీ ఎన్నిక
టీయూడబ్ల్యూజే అబ్దుల్లాపూర్‌మెట్ మండల అధ్యక్షుడిగా గూడెపు జగన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నామా ఆంజనేయులు, గౌరవాధ్యక్షులుగా శ్రీరాం యాదయ్య, ఉపాధ్యక్షులుగా కట్టంగూరు మల్లేష్, గండికోట సత్యం, నాగార్జున, జాయింట్ సెక్రటరీలుగా చెరుకు ఉపేందర్ గౌడ్, పొలగోని రాజేష్, కుకుట్లపల్లి రాకేష్, కోశాధికారిగా బండ శేఖర్ రెడ్డి, సలహాదారులుగా గడ్డం భాస్కర్ రెడ్డి, రాసాల వెంకటేష్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
