ePaper
Monday, October 5, 2026
ePaper
Homeఎడిటోరియల్బాక్సాఫీస్ బద్దల్.. 'ప్యారడైజ్' పూనకాలు!

బాక్సాఫీస్ బద్దల్.. ‘ప్యారడైజ్’ పూనకాలు!

📰 Generate e-Paper Clip

 • టైర్ 1 లీగ్‌లోకి హీరో నాని.. ఊరమాస్ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల

 • ఫేక్ రివ్యూలకు చెక్ పెడుతూ.. నైజాం టూ నార్త్ అమెరికా రికార్డుల మోత

• గణేష్ నిమజ్జనంలో మారుమోగిన ‘షేర్’ మంత్రం.. స్టెప్పులేసిన సీపీ!

 

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో ఎక్కడ చూసినా ప్రేక్షకుల పూనకాలే కనిపిస్తున్నాయి. నైజాం నుంచి నార్త్ అమెరికా దాకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. కొందరు కన్నింగ్ కంత్రిగాళ్లు పనిగట్టుకుని రాసిన అక్కసు రివ్యూలపై తెలంగాణ బిడ్డలు కన్నెర్ర చేశారు. వారి నెగెటివ్ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ.. సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

 

క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నానిని.. దసరా లాంటి హిట్ తో మాస్ ట్రాక్ ఎక్కించిన శ్రీకాంత్ ఓదెల, ఈ ‘ప్యారడైజ్’ తో ఏకంగా పక్కా ఊరమాస్ హీరోగా రాజముద్ర వేశారు. ఈ ఒక్క దెబ్బతో నాని రేంజ్ అమాంతం మారిపోయింది. టైర్-2 హీరోల జాబితా నుంచి నేరుగా టైర్-1 లీగ్‌లోకి సగర్వంగా అడుగుపెట్టారు. వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్లతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఎక్కడలేని హైప్ రాగా.. ‘ప్యారడైజ్’ మేకింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో సైతం హాట్ టాపిక్ గా మారింది.

నిమజ్జనంలో ‘షేర్’ వైబ్రేషన్స్.. ప్రాణం పోసిన అనిరుధ్

సినిమాలోని పాటలు, ముఖ్యంగా ‘షేర్’ సాంగ్ ప్రస్తుతం యువతను ఉర్రూతలూగిస్తోంది. మొన్నటి గణేష్ మహానిమజ్జనోత్సవాల్లో ఎక్కడ చూసినా అంతా ఈ పాట మంత్రమే వినిపించింది. ఈ ఉత్సాహంలో ఏకంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సైతం పాటకు స్టెప్పులేయడం సినిమా స్థాయికి, పాట క్రేజ్ కు అద్దం పడుతోంది. రాక్ స్టార్ అనిరుధ్ అందించిన సంగీతం మరోసారి తెలుగు వాళ్ళ మనసు గెలుచుకుంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఆయువుపట్టుగా నిలిచి, థియేటర్లలో జడల్ శివాల్ అనేంతలా ఊపు తెచ్చింది.

 

 

‘ప్యారడైజ్’ సినిమా సాధించిన భారీ విజయం అటు రాజకీయంగానూ ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సినిమాకు తనదైన శైలిలో అభినందనలు తెలపడం, చిత్ర యూనిట్ కు మద్దతుగా నిలవడంతో అది సినిమాకు మరింత జోష్ తీసుకువచ్చింది. అదే సమయంలో సినిమాలోని కొన్ని కీలక అంశాలు గులాబీ పార్టీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహాన్ని నింపాయి. మొత్తానికి ‘ప్యారడైజ్’ అటు బాక్సాఫీస్ వద్ద మాస్ జాతరను తలపిస్తూ తెలుగు సినీ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచిపోయింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!