ePaper
Friday, October 9, 2026
ePaper
HomeతెలంగాణSouth India Shopping Mall 40వ స్టోర్ ప్రారంభం

South India Shopping Mall 40వ స్టోర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 40వ స్టోర్ ప్రారంభం

  • దసరా, దీపావళి పండగలకు ప్రత్యేక కలెక్షన్లు

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు

హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 40వ స్టోర్‌ను గురువారం ప్రారంభించింది. బాచుపల్లి–మియాపూర్ రోడ్డులోని అమీన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను సినీనటి వైష్ణవి చైతన్య జ్యోతి వెలిగించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో షాపింగ్ ప్రియులు హాజరై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. దసరా, దీపావళి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని నూతన స్టోర్‌లో కుటుంబంలోని అన్ని తరాల వారికి అనువైన వస్త్రాల ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు యాజమాన్యం తెలిపింది. సంప్రదాయ చీరలు, పండగ దుస్తులు, వివాహ వేడుకలకు అనువైన వస్త్రాలు, సరికొత్త డిజైన్లతో కూడిన ఫ్యాషన్ దుస్తులు ఒకేచోట లభించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సినీనటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బాచుపల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 40వ స్టోర్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దసరా, దీపావళి వంటి పర్వదినాల సందర్భంగా కుటుంబ సభ్యుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న రకాల వస్త్రాలు ఒకేచోట అందుబాటులో ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఛైర్‌పర్సన్, హోల్‌టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాచుపల్లి ప్రాంతంలో 40వ స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నందున పండగలు, వివాహ వేడుకలకు అవసరమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శీర్ణ రాజమౌళి మాట్లాడుతూ.. దసరా, దీపావళి పర్వదినాలతో పాటు వివాహ వేడుకలు, కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల వస్త్ర ఉత్పత్తులను సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతితో అందించడమే తమ లక్ష్యమన్నారు. హోల్‌టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. సంప్రదాయాన్ని ప్రతిబింబించే పట్టుచీరలు, పండగ చీరలు, క్యాజువల్ వేర్‌తో పాటు కుటుంబంలోని అన్ని తరాల వారికి నచ్చే విధంగా విభిన్న రకాల వస్త్రాలు నూతన స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళల కోసం కంచి పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, దేశవ్యాప్తంగా మాస్టర్ వీవర్స్ రూపొందించిన ప్రత్యేక డిజైన్లతో పాటు పెళ్లికుమార్తెలకు అనువైన సంప్రదాయ వస్త్రాలను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. పురుషుల కోసం డిజైనర్ కుర్తాలు, ఎత్నిక్ వేర్, ఫార్మల్ సూట్స్, క్యాజువల్ దుస్తులు, చిన్నారుల కోసం ట్రెండీ ఫెస్టివల్ సూట్స్ వంటి విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. దసరా, దీపావళి పర్వదినాలు, వివాహాది శుభకార్యాల సందర్భంగా బాచుపల్లి–మియాపూర్–అమీన్‌పూర్ పరిసర ప్రాంతాల ప్రజలు నూతన స్టోర్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న ప్రత్యేక కలెక్షన్లు, ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కోరింది.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!