ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeక్రైమ్కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. విద్యుత్ ఘాతకానికి గురై వ్యక్తి మృతి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. విద్యుత్ ఘాతకానికి గురై వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. విద్యుత్ ఘాతకానికి గురై వ్యక్తి మృతి

అబ్దుల్లాపూర్మెట్ – ప్రభాత సూర్యుడు 

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అభం, శుభం తెలియని ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా, గొట్టిపడియ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (40) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఎల్బీనగర్ సమీపంలోని డిఆర్డిఎల్ కాలనీలో నివాసముంటూ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాసుల వెంకటేష్ వద్ద ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం గౌరెల్లి గ్రామ కూడలి సమీపంలో సింగల్ ఫేస్ నుండి త్రీఫేస్ లైన్ కన్వర్షన్ చేయాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం విధి నిర్వహణ సమయంలో సూపర్వైజర్ పర్యవేక్షణ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ కాసుల వెంకటేష్ నిర్లక్ష్యం, సూపర్వైజర్ రమేష్ పర్యవేక్షణ లోపం కారణంగా లైన్ కన్వర్షన్ చేసేందుకు ఎలక్ట్రిషన్ వెంకట్ రెడ్డి సూపర్వైజర్ రమేష్ ఫోన్లో అందిస్తున్న సూచనల మేరకు ఎలక్ట్రికల్ పోల్ ఎక్కాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ఘాతకానికి గురై కరెంటు స్తంభం పై నుండి వెంకట్ రెడ్డి క్రింద పడ్డాడు. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు నాగోల్ పోలీసులకు సమాచారం అందించి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు అప్పటికే వెంకట్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, సూపర్వైజర్ పర్యవేక్షణ లోపం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే కాంట్రాక్టర్ కాసుల వెంకటేష్, సూపర్వైజర్ రమేష్ లపై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!