ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeజిల్లా వార్తలుGovernment Land Protection : పిగ్లిపూర్ భూములపై విచారణకు వినతి

Government Land Protection : పిగ్లిపూర్ భూములపై విచారణకు వినతి

📰 Generate e-Paper Clip

పిగ్లిపూర్ ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

సర్వే నంబర్ 17లో భూముల ఆక్రమణలపై విచారణ జరపాలి

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్ – ప్రభాత సూర్యుడు:

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లిపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 17లో ఉన్న ప్రభుత్వ, భూదాన్, సీలింగ్ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

1954–55 గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 17లో మొత్తం 386 ఎకరాల 15 గుంటల భూమి ఉన్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో భూదాన్ యజ్ఞ బోర్డుకు 75 ఎకరాలు, ఖిరిజ్ ఖాతా ప్రభుత్వ భూమిగా 61 ఎకరాలు, సీలింగ్ ప్రభుత్వ భూములుగా 53 ఎకరాలు, మిగిలిన 197 ఎకరాల 15 గుంటలు పట్టా భూములుగా ఉన్నట్లు వివరించారు.

గతంలో తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులు, సంబంధిత భూ రికార్డులు, సర్వే వివరాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ భూముల సరిహద్దులను నిర్ధారించాలని సర్పంచ్ కోరారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగాయా అనే అంశంపై విచారణ జరిపి, ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పర్యాటక అభివృద్ధికి, ప్రభుత్వ అధికారుల నివాసాల నిర్మాణానికి అవసరమైన భూములను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!